అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఆర్కిటిక్ బ్లాస్ట్ కాస్త శక్తివంతమైన బాంబ్ సైక్లోన్ గా రూపాంతరం చెందడంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో మంచు తుఫాన్ విరుచుకుపడింది. దాంతో చాలా రాష్ట్రాల్లో మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. మంచు తుఫాన్ వల్ల ఇప్పటి వరకు అమెరికాలో 21 మంది మరణించగా 6 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. అలాగే 20 లక్షలకు పైగా ఇళ్లకు కరెంట్ కట్ అయ్యింది.
హైవే పై మంచు పేరుకుపోవడంతో హైవేలు మూసుకుపోయాయి. ఒకవైపు మంచు తుఫాన్ , మరోవైపు పెనుగాలుల వల్ల కరెంట్ సస్థంబాలు, చెట్లు నేలకూలాయి. చలిగాలుల వల్ల ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది ఈ మంచు తుఫాన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు.