ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) బోర్డు డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ కొడాలి భార్య , ఇద్దరు కూతుర్లు కూడా మరణించారు దాంతో తీవ్ర దుఖసాగరంలో మునిగారు డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి. భార్య , ఇద్దరు కూతుర్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు దాంతో నాగేంద్ర కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. తనకు భార్య ఇద్దరు కూతుర్లు కాగా…… భార్య సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. అలాగే పెద్ద కూతురు డాక్టర్ విద్యను అభ్యసిస్తుండగా చిన్న కూతురు ఇంటర్ చదువుతోంది. నాగేంద్ర ఇంట తీవ్ర విషాదం నెలకొనడంతో పలువురు ప్రవాసాంధ్రులు తీవ్ర విచారం వెలిబుచ్చారు.