అగ్రరాజ్యం అమెరికాలో కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా అమెరికా లోని న్యూజెర్సీలో లోగల ఎడిసన్ లో భారీ ఎత్తున తెలంగాణ బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఆ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలు , పురుషులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ మొదట్లో కేవలం తెలంగాణ ప్రాంతంలోనే జరిగేవి. అయితే కాలక్రమంలో బతుకమ్మ సంబరాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.
తాజాగా ఎడిసన్ లో తెలంగాణ బతుకమ్మ సంబరాలు జరుగగా ఆ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించింది తెలంగాణ అమెరికా తెలుగు సంఘం. అమెరికాలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ప్రవాసులకు అండగా నిలుస్తోంది.
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు మోహన్ రెడ్డి, వంశీ రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్ , పవన్ , కవితా రెడ్డి, హరిందర్, వెంకట్ , నవీన్ , ద్వారాకనాథ్ రెడ్డి , నరసింహ రెడ్డి, మాధవి , భరత్, మల్లారెడ్డి, విజయపాల్ రెడ్డి , డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ప్రభుతులు పాల్గొన్నారు.