
తానా ఆధ్వర్యంలో అమెరికాలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో భారీ ఎత్తున ఈ వేడుకలు జరిగాయి. యాంకర్ గా నటిగా సత్తా చాటుతున్న హాట్ భామ అనసూయ , సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సింగర్ మంగ్లీ తదితరులు ఈ వేడుకలలో పాల్గొనడంతో మరింత శోభాయమానంగా తయారయ్యింది. అనసూయ , మంగ్లీ లతో ప్రవాసాంధ్ర మహిళలు బతుకమ్మ ఆట ఆడారు. ఈ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలతో పాటుగా పిల్లలు , పురుషులు పాల్గొన్నారు.
తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి , జై అట్లూరి, నిరంజన్ శృంగవరపు , వెంకట రమణ , డాక్టర్ హనుమయ్య, శిరీష, లక్ష్మీ, సతీష్ , అశోక్ తదితర కార్యవర్గం ఈ వేడుకలు జయప్రదం అయ్యేలా చేశారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్