అగ్ర రాజ్యం అమెరికాలో పెద్ద ఎత్తున స్థిరపడిన తెలుగువాళ్లు పలు సేవా సంస్థలను నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఆ సేవా సంస్థలలో అగ్రస్థానం ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( TANA ) దే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సుమా! పలు సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసింది తానా. ఈ ఏడాది జూలై 7, 8 మరియు 9 వ తేదీలలో మూడు రోజుల పాటు తానా 23 rd TANA Conference జరుగనుంది.
కాగా ఆ వేడుకలను జయప్రదం చేయడానికి ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టింది తానా. న్యూజెర్సీలోని ఎడిసన్ లో తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో మార్చి 4 న ఎడిసన్ లో ఫండ్ రైజింగ్ కోసం డిన్నర్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు, తానా సభ్యులు పాల్గొన్నారు. జూలై లో జరుగబోయే కార్యక్రమం విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.