అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. కొత్తపల్లి గీత తో పాటుగా ఆమె భర్త రామకోటేశ్వరరావు ను కూడా అరెస్ట్ చేశారు. తొలుత ఉస్మానియా ఆసుపత్రి కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 50 కోట్లకు పైగా అప్పు తీసుకొని ఆ డబ్బుని ఎగ్గొట్టడంతో బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కొత్తపల్లి గీతపై కేసు నమోదు చేశారు సిబిఐ అధికారులు.
సిబిఐ కోర్టులో విచారణ సాగగా కొత్తపల్లి గీతతో పాటుగా ఆమె భర్తను దోషులుగా నిర్దారించిన సీబీఐ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష ను విధించింది. సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేయడంతో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత లాయర్లు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. 2014 లో ఏపీ లోని అరకు పార్లమెంట్ స్థానం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించింది కొత్తపల్లి గీత . అయితే ఆ తర్వాత జగన్ తో విభేదించి పార్టీ నుండి బయటకు వచ్చింది.