
బ్రిటీష్ రాణి ఎలిజబెత్ – 2 తన జీవిత కాలంలో భారతదేశంలో మూడు సార్లు పర్యటించింది. 1983 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా అదే సమయంలో రాణి ఎలిజబెత్ భారత్ లో పర్యటించింది. భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు కూడా వచ్చింది.
1983 నవంబర్ 20 న హైదరాబాద్ కు రావడంతో బ్రిటీష్ రాణి దంపతులకు అప్పటి గవర్నర్ రాం లాల్, ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల పాటు బ్రిటీష్ రాణి ఏపీలో పర్యటించారు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 8 న మరణించారు. దాంతో అప్పట్లో నందమూరి తారకరామారావు బ్రిటీష్ రాణి దంపతులకు స్వాగతం పలికిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.