హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి ఎండగా ఉన్న ప్రాంతం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా వర్షం భారీగా కురవడంతో రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరింది. ఇక సాయంత్రం ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయంలో కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళేవాళ్ళు పెద్ద ఎత్తున వర్షంలో చిక్కుకున్నారు.
ఇక హైదరాబాద్ నగరం అంతటా వర్షం కురుస్తోంది. ఈరోజు అలాగే రేపు కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖాధికారులు నిన్ననే వెల్లడించారు. అయితే ఉదయం ఎండ గట్టిగానే పడటంతో వర్షం పడుతుందా ? అని అనుకున్నారు కట్ చేస్తే సాయంత్రం ఒక్కసారిగా వాతావరం పూర్తిగా మారిపోయింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.