
తెలంగాణ కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి కి షాక్ ఇచ్చింది ఐటీ.ఒక్కసారిగా మంత్రి మల్లారెడ్డి ఇంటిపై అలాగే పలు కార్యాలయాలపై ఏకకాలంలో 50 చోట్ల ఐటీ దాడులు జరిగాయి. ఈరోజు ఉదయం నుండి ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటుగా అల్లుడు రాజశేఖర్ రెడ్డి , కొడుకు ఇళ్లల్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.
మల్లారెడ్డి యూనివర్సిటీ , కాలేజ్ లతో పాటుగా పలు కార్యాలయాలలో మొత్తంగా 50 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ట్యాక్స్ ఎగవేత గురించి అదే సమయంలో క్యాసినో లో పెట్టిన పెట్టుబడులు , రాబడి గురించి ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి.