
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నేను రాబోయే ఎన్నికలో పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుండి ఓ సామాన్య కార్యకర్తను సంగారెడ్డి నుండి పోటీలో నిలబడతామని , ఒకవేళ ఏ కార్యకర్త కూడా ముందుకు రాకపోతే నాభార్య నిర్మల పోటీ చేస్తూందని నేను మాత్రం 2028 లోనే మళ్ళీ పోటీ చేస్తానని ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాడు.
మొదట బీజేపీ లో ఆ తర్వాత టీఆర్ఎస్ లో పనిచేసిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న జగ్గారెడ్డి కొంతకాలంగా రేవంత్ రెడ్డి వ్యవహారంతో తీవ్ర అసహనంతో ఉన్నాడు. దాంతో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నాడు. అందులో భాగంగానే 2023 లో జరగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి అందరినీ షాక్ అయ్యేలా చేసాడు.