
సాధారణంగా ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత రకరకాల కారణాలతో మరో పెళ్లి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. అయితే అనూహ్యంగా ఓ పెళ్లి కొడుకు మాత్రం ఒకే రోజున ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ సంచలన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు జరుగబోతుంది. మార్చి 9 న ఈ పెళ్లి జరుగనుంది. ఇంతకీ ఇద్దరినీ చేసుకునే ఆ పెళ్లి కొడుకు పేరు సత్తిబాబు. కాగా పెళ్లి కుతుర్ల పేర్లు స్వప్న కుమారి , సునీత . ఈ ఇద్దరితో గత ఏడాది కాలంగా కాపురం చేస్తున్నాడట సత్తిబాబు. అయితే రేపు మాత్రం అధికారికంగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు, ఇద్దరు అమ్మాయిలు కూడా ఒప్పుకోవడం విశేషమే మరి.