సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి , లేదంటే ఆకతాయి పనులు చేసి తమ దమ్ము ఇది అని నిరూపించడానికి రకరకాల పనులు చేస్తున్నారు యువతీయువకులు. ఇటీవల కాలంలో పలువురు అమ్మాయిలు , అబ్బాయిలు బైక్ పై రైడ్ చేస్తూ కిస్సులతో , హగ్గులతో రెచ్చిపోతూ రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాళ్లకు షాక్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్లపై పోలీసులు కేసులు పెడుతున్నా లెక్క చేయడమే లేదు.
తాజాగా అలాంటి సంఘటనే రాజస్థాన్ లో జరిగింది. సాహిల్ అనే యువకుడు తన ప్రేయసిని బైక్ పై ఫ్యూయల్ ట్యాంక్ మీద కూర్చోబెట్టుకొని రైడింగ్ కు బయలుదేరాడు. నడిరోడ్డు మీదే ఆ యువతీ యువకులు ముద్దులతో , ఘాటు కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ రోడ్డులో రాత్రి పూట జరిగింది. దాంతో కొంతమంది ఈ తతంగమంతా వీడియో తీసి పోలీసులకు ట్యాగ్ చేసారు. ఇంకేముంది పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా సాహిల్ ను పట్టుకొని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అతడి పై కేసు నమోదు చేసారు. ఈ కిస్సుల , హగ్గుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గ మారింది.