కూరగాయలు అమ్ముకొని జీవనం సాగించే వ్యక్తి ఎకౌంట్ లో ఏకంగా 172 కోట్లు డిపాజిట్ అయ్యాయి. దాంతో ఆ అమౌంట్ చూసి షాక్ అవుతున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ కు చెందిన విజయ్ రస్తోగి అకౌంట్ కు 172 కోట్లు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఈ విషయం సంచలనంగా మారింది. సాధారణ వ్యాపారి అకౌంట్ కు 172 కోట్లు ఎలా ట్రాన్స్ ఫర్ అవుతాయి అని షాక్ అవుతున్నారు.
సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ ట్రాన్స్ ఫర్ ద్వారా విజయ్ రస్తోగి అకౌంట్ లోకి భారీ మొత్తం జమ కావడంతో పూర్తి వివరాలు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. విజయ్ రస్తోగి నిజంగానే కూరగాయల వ్యాపారం చేస్తున్నాడా ? లేక తెరవెనుక ఏదైనా మతలబు ఉందా ? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పేరు నాదే అయినప్పటికీ ఆ అకౌంట్ కు నాకు సంబంధం లేదని అంటున్నాడు విజయ్ రస్తోగి. అయితే పోలీసుల విచారణలోనే 172 కోట్ల రహస్యం ఏంటి అన్నది తేలనుంది ……. ఆ అకౌంట్ అసలు విషయం తేలనుంది.