30.7 C
India
Wednesday, February 18, 2026
More

    పున్నమి నాగుకు కీర్తి సురేష్ కు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

    Date:

    చిరంజీవి నటించిన పున్నమినాగు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో చిరంజీవి నటనకు మంచి పేరు వచ్చింది. నాగులుగా చిరు అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో ఈ సినిమాలో నటించినందుకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అద్భుతమైన సినిమాగా పున్నమినాగు రికార్డులు తిరగరాసింది.

    సినిమాలో చిరంజీవి తండ్రి చిన్నప్పటి నుంచి అతడి ఆహారంలో విషం కలిపి ఇవ్వడం వల్ల చిరు శరీరం మొత్తం విషంగా మారుతుంది. అతడికి పాము కుట్టినా ఏం కాదు. అలా శరీరం మొత్తం విషంగా మారడంతో అతడు ఏ అమ్మాయితో కలిసినా ఆమె ప్రాణాలు కోల్పోతుంది. దీనిపై రాజు అనే అతడు చిరు మీద అనుమానంతో నిఘా పెడతాడు. చివరకు చిరంజీవి ఇదంతా చేస్తున్నాడని నిరూపిస్తాడు.

    అప్పట్లో ఏవీఎం సినిమాల్లో పాములే ప్రధానంగా ఉండేవి. అదేకోవలో ఈ సినిమా కూడా అలాగే తీశారు. ఇందులో హీరోయిన్ గా మేనక నటించింది. ఆమె ఎవరో కాదు సాక్షాత్తు కీర్తి సురేష్ కు స్వయానా తల్లి. ఆమె కేవలం రెండు తెలుగు చిత్రాల్లో మాత్రమే నటించింది. ఇప్పుడు చిరంజీవి, కీర్తి సురేష్ లు భోళాశంకర్ సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటిస్తుండటంతో ఆనాడు తల్లితో నేడు కూతురుతో చిరు నటించడం విశేషం.

    ఇలా కీర్తి సురేష్ కు పున్నమినాగుతో ఉన్న అనుబంధం అలాంటిది. చిరంజీవి తల్లితో పాటు కూతురుతో నటించడం గమనార్హం. భోళాశంకర్ కు దర్శకుడు మెహర్ రమేష్. ఈ సినిమా ఏ వండర్ క్రియేట్ చేస్తుందోనని అందరు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తల్లికి ఆ సినిమా పేరు తెచ్చినట్లుగానే ఈ సినిమా కూతురుకు సైతం పేరు తెస్తుందో లేదో చూడాల్సిందే మరి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    chiranjeevi fans : చిరంజీవి ఫ్యాన్స్ కు పండగే..

    chiranjeevi fans ఓ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగు ఏంటంటే నరికినా...

    Keerthi Suresh : ఇదేమి ఖర్మ కీర్తి సురేశ్.? స్టార్ హీరోని కాదని.. డ్రైవర్ తో లవ్వా!

    Keerthi Suresh : కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు’ ఈ నానుడి...

    వివాదంలో నాని దసరా

    నాని హీరోగా నటించిన దసరా చిత్రం సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది....

    నాని దసరా ఫస్ట్ డే కలెక్షన్స్

    నాని హీరోగా నటించిన చిత్రం దసరా. శ్రీరామ నవమి కానుకగా ప్రపంచ...