
గర్భం దాల్చి పిల్లలను కనాలంటే పెళ్లి చేసుకోవాలా ? అని ఎదురు ప్రశ్న వేస్తోంది సీనియర్ నటి ” టబు ”. ఒంటి మీదకు 50 ఏళ్ళు వచ్చినప్పటికీ ఈ భామ మాత్రం ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు నాకింతవరకు సరైన మగాడు తగలలేదు అందుకే పెళ్లి చేసుకోలేదు. అయినా తల్లి కావాలంటే పెళ్లి చేసుకోవాలా ? గర్భం దాల్చడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టింది టబు.
ఈరోజుల్లో గర్భం దాల్చాలంటే సరోగసీ ద్వారా తల్లి కావచ్చు. పిల్లలను కనొచ్చు అంతేకాని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యాక్టింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేసింది టబు. పక్కా హైదరాబాదీ అయిన టబు ముంబైలో స్థిరపడింది. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ భామ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది.
అయితే సినిమాల్లో నటించే సమయంలో అజయ్ దేవ్ గన్ ని పీకల్లోతు ప్రేమించిందని టాక్ . అలాగే హీరో నాగార్జున ని కూడా టబు ప్రేమించిందని , ఈ ఇద్దరి మధ్య అంతకుమించిన సంబంధం ఉందని ఊహాగానాలు కూడా చెలరేగాయి. వాటి గురించి పక్కన పెడితే తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఈ భామ పెళ్లి , గర్భం గురించి వ్యాఖ్యానించి షాక్ అయ్యేలా చేసింది.