డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. చాలా రోజులుగా సలార్ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా ? అని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్లకు ఎట్టకేలకు శుభవార్త తెలిపారు సలార్ మేకర్స్. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
డార్లింగ్ ప్రభాస్ విభిన్న పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2023 సెప్టెంబర్ 28 న విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు దర్శక నిర్మాతలు. ఆమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ ఏడాదిలోనే సలార్ వస్తుందేమో అని ఆశించారు. కానీ వచ్చే ఏడాదికి మారిపోయింది.
అయితే విడుదల ఆలస్యం అవుతున్నప్పటికీ రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి డార్లింగ్ ఫ్యాన్స్ కు సంతోషంగానే ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రాలు రెండు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇక ప్రభాస్ విషయానికి వస్తే …… బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన సాహో , రాధే శ్యామ్
చిత్రాలు దారుణమైన పరాజయాలను చవిచూశాయి. దాంతో సలార్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Breaking News
PRABHAS- SALAAR- PRASHANTH NEEL:ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త : సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Date: