![rashmi goutham](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/05/rashmi-goutham.jpg)
రష్మీ గౌతమ్ పుట్టిన రోజు ఏప్రిల్ 27 ఆమె ఆ రోజు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. రష్మీ స్నేహితులు, సన్నిహితులు, స్టార్ యాంకర్లు అందరూ వచ్చారు. పార్టీకి సంబంధించి కొన్ని ఫొటోలను రష్మీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. దీనికి క్యాప్షన్ ‘నీతో ఉండేవాళ్లు ఉంటారు.. పోయే వాళ్లు పోతారు.. నువ్వు మాత్రం మారకు’ అంటూ పెట్టింది. తన జీవితంలో మరో ఇయర్ ముగిసిందని పేరెంట్స్, ఫ్రెండ్స్, ఫ్యాన్స్, తన లైఫ్ లో ప్రధాన పిల్లర్లు అంటూ అభివర్ణించింది రష్మీ. వీరందరికీ అభినందనల అని పోస్ట్ పెట్టింది.
ఇందరు ఉన్నా సుడిగాలి సుధీర్ ఎక్కడ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సుడిగాలి సుధీర్ కోసం తాము వెతుకుతున్నామంటూ ఇన్ స్టాలో ఫొటోలు చూసిన అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన రాకపోవడంతోనే రష్మీ కూడా నీ జీవితంలో ఉండేవాళ్లు ఉంటారు.. పోయేవాళ్లు పోతారు.. అంటూ క్యాప్షన్ పెట్టడంలో ఆంతర్యం ఇదేనేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రష్మీ-సుధీర్ లవర్స్ అంటూ జబర్దస్త్ యాంకర్ గా రష్మీ వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు వీరిద్దరూ కలిసి చాలా షోలు, ఈవెంట్ లలో యాంకర్లుగా చేశారు. కొన్ని షోలలో అయితే వీరికి పెళ్లి కూడా (ప్రోగ్రామ్ కొరకు మాత్రమే) చేశారు నిర్వాహకులు. అంతలా ఈ జంటపై రూమర్స్ పాకాయి. అయితే రష్మీ మాత్రం తమ మధ్య ఎలాంటిది లేదని, కేవలం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్తుంది.