
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి . తాజాగా ఈ చిత్రం నుండి పిచ్చెక్కించే ఐటెం సాంగ్ వచ్చేసింది. మాబావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే వీడియో సాంగ్ విడుదల చేసారు. ఊర మాస్ ను ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట కిరాక్ అనిపించడం ఖాయం. అసలే మాస్ బీట్ ఆపై బాలయ్య వేసిన మాస్ స్టెప్పులు మరింత గోల గోలగా ఉన్నాయి. బాలయ్య వేసిన డ్యాన్స్ కు థియేటర్లు దద్దరిల్లి పోవడం ఖాయం.
తమన్ అందించిన సంగీతం ఈ పాటను మరింత ఎలివేట్ అయ్యేలా చేసింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం యూత్ ని విశేషంగా అలరించడం ఖాయం. ఈ పాటలో బాలయ్య తో పాటుగా మలయాళ భామ హనీ రోజ్ నటించింది. ఇక బాలయ్య ముందు వాళ్ళు తెలిపోయారు పాపం. జనవరి 12 న వీరసింహారెడ్డి చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండగా ఒకరి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా మరోక హీరోయిన్ గా మలయాళ భామ హనీ రోజ్ నటిస్తోంది.