మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2023 జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు వరకు వాల్తేరు వీరయ్య చిత్రం నుండి రెండు పాటలు విడుదల కాగా ఆ రెండు పాటలు కూడా బాగానే ఉన్నాయి కానీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ కాకపోవడంతో మెగా అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు.
కట్ చేస్తే తాజాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాట అభిమానులను ఖుషీ చేసేలా ఉంది. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ బాగుండటంతో అద్భుత స్పందన వస్తోంది. ఇక అభిమానులు కూడా ఇది కదా ……. బాస్ నుండి కావల్సిన పాట అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ……. కాలర్ ఎగురవేస్తున్నారు.
ఈ టైటిల్ సాంగ్ ను చంద్రబోస్ అందించాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన మాస్ బీట్ కూడా అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తుండగా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఊర మాస్ చిత్రంగా వాల్తేరు వీరయ్య చిత్రం రూపొందుతోంది. చిరంజీవి లుక్స్ కూడా అభిమానులను విశేషంగా అలరించేలా ఉన్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.