Ileana ఎట్టకేలకు గోవా బ్యూటీ ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరో రివీల్ చేసింది.. దీంతో ఇన్ని రోజులు ఎంతో సస్పెన్స్ గా నడిచిన ఈ మ్యాటర్ ఎట్టకేలకు ఇలియానా రివీల్ చేయడంతో సస్పెన్స్ ముగిసింది.. మరి ఈ బ్యూటీ బిడ్డకు తండ్రి ఎవరు? ఇన్ని రోజులు ఎందుకు ఈమె హైడ్ చేసింది? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
ఇలియానా త్వరలోనే తల్లి కాబోతుంది అనే విషయం ఈ మధ్యనే అందరికి చెప్పింది.. ఈ విషయం విన్నవారంతా నోరెళ్లబెట్టిన సంగతి తెలిసిందే.. గత కొద్దిరోజుల క్రితం ఈ హాట్ బ్యూటీ ప్రెగ్నెన్సీ అని ప్రకటించింది.. ఆ తర్వాత సైలెన్స్ గా ఉంది.. దీంతో ఈమె నిజంగానే ప్రెగ్నెంట్ అవునో కాదో అనే కన్ఫ్యూజన్ లో అందరు పడ్డారు..
ఆ తర్వాత ఈమె బేబీ బంప్ తో ఉన్న లేటెస్ట్ పిక్ ను రివీల్ చేసింది.. ఏప్రిల్ లోనే బిడ్డకు వెల్కమ్ చెబుతూ ప్రెగ్నెన్సీ అంటూ పోస్ట్ చేసింది.. ఆ తర్వాత కొద్దీ రోజులకు బేబీ బంప్ తో దర్శనం ఇచ్చి స్వీట్ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పెళ్లి కాకుండానే ఈమె తల్లి కావడం ఒక మ్యాటర్ అయితే ఆ బిడ్డకు తండ్రి ఎవరో రివీల్ చేయకుండా అందరిని సస్పెన్స్ లో పెట్టింది.
మరి ఇన్ని రోజులుగా అందరి మదిలో ఎదురైనా ప్రశ్నలకు ఈ రోజు క్లారిటీ ఇచ్చింది. ప్రజెంట్ ఇలియానా 9 నెలల గర్భవతి.. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇప్పటికైనా రివీల్ చేయాలని ఫ్యాన్స్ కోరుకోగా ఎట్టకేలకు ఈ విషయం బయట పెట్టేసింది. తన ప్రియుడుతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఇలియానా అక్కడ అతడితో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో ఉన్న వ్యక్తి స్టైలిష్ గా గడ్డంతో కనిపిస్తూ చూడ్డానికి విదేశీయుడిలా అనిపిస్తున్నాడు. బాలీవుడ్ లో వస్తున్న రూమర్స్ ప్రకారం కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ తో ఈమె డేటింగ్ చేస్తున్నట్టు అంతా ఫిక్స్ అయ్యారు.. కానీ ఈ పిక్ షేర్ చేయడంతో ఇవి రూమర్స్ అని తేలిపోయింది. మరి ఆ ప్రియుడు వివరాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అతడ్ని రివీల్ చేసిన ఇలియానానే ఆయన వివరాలు కూడా చెప్పాలి.