టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ పిక్స్ వైరల్ గా మారాయి. మహేష్ బాబు కండలు పెంచుతూ జిమ్ లో బాగానే కష్టపడుతున్నాడు. జిమ్ లో ఎంతగా కష్టపడుతున్నాడో చెప్పకనే చెప్పే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు మహేష్. ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. మహేష్ బాబు జుట్టు బాగా పెంచడమే కాకుండా ఇప్పుడు కండలు కూడా పెంచుతున్నాడు.
తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసమే మహేష్ ఇలా కసరత్తులు చేస్తున్నాడు. మహేష్ బాబు కండలను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక మహిళా అభిమానులు అయితే మహేష్ కండలను చూసి ఊహాలోకాల్లో తేలిపోతున్నారు.
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా శ్రీ లీల కూడా మరొక హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు – పూజా హెగ్డే కాంబినేషన్ లో ఇంతకుముందు మహర్షి చిత్రం రాగా అది సూపర్ హిట్ అయ్యింది. దాంతో మరోసారి రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. అలాగే త్రివిక్రమ్ పూజా హెగ్డే ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు తన సినిమాలతో. మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇది ముచ్చటగా మూడో సినిమా. అతడు , ఖలేజా అంతగా ఆడలేదు దాంతో ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతునారు బ్లాక్ బస్టర్ చేయాలని.