
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈరోజే అట్టహాసంగా ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. అయితే మన అభిమాన హీరో రెస్టారెంట్ కదా అని అందులోకి వెళ్లిన వాళ్లకు కళ్ళు బైర్లు కమ్మేలా షాకిస్తోంది. ఎందుకో తెలుసా……. ఈ రెస్టారెంట్ లో రేట్లు బహు ప్రియం సుమా! అంటే కామన్ మ్యాన్ కి అందులో చోటు లేదు అన్నమాట.
ప్లేట్ ఇడ్లీ 125 రూపాయలు. కేవలం ఒక్క టీ ధర 80 రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది . ఆ లిస్ట్ చూస్తే మరింతగా గిరగిరా కళ్ళు తిరగడం ఖాయం. అయితే ఈ ధరలు సామాన్యులకు ఎక్కువ కానీ డిక్కీ బలిసిన వాళ్లకు మాత్రం చాలా తక్కువే అనిపిస్తాయి.
అంటే ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే మహేష్ బాబు రెస్టారెంట్ కాస్త డబ్బున్న వాళ్లకు మాత్రమే ! అయితే ఇందులో రుచి చూసిన వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఐటమ్స్ రుచిగా ఉన్నాయట. పైగా డిక్కీ బలిసిన బంజారాహిల్స్ లో ఇది ఉంది కాబట్టి త్వరలోనే ఫేమస్ అయిపోవడం ఖాయం. యువతీయువకులకు …… అంటే డబ్బున్న వాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలవనుంది మహేష్ బాబు రెస్టారెంట్.