
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మిథునం నిర్మాత ముయిద ఆనందరావు ( 57 ) అనారోగ్యంతో మరణించారు. విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని వావిలవలస గ్రామం ఆనందరావు స్వగ్రామం. అంచెలంచెలుగా ఎదిగి మిథునం అనే చిత్రాన్ని నిర్మించారు. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , లక్ష్మీ జంటగా నటించిన మిథునం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు కూడా లభించింది. విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించడం విశేషం.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దాంతో విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు సాయంత్రం స్వగ్రామంలో ఆనందరావు అంత్యక్రియలు జరుగనున్నాయి.