
Nagababu : మగధీర లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్ లో హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరెంజ్. ఎన్నో అంచనాల మధ్య 2010లో రిలీజైన ఈ సినిమా మొదటి షో నుంచే ప్లాఫ్ టాక్ ను మూటగట్టకుంది. ఈ సినిమా డిజాస్టర్ తో నాగబాబు కోలుకోలేని దెబ్బతిన్నాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ సమయంలో తన అన్నయ్య చిరంజీవి నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ రాలేదని ఇండస్ర్టీలో టాక్. అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు ఆ సమయంలో సెద్దగా సక్సెస్ లు కూడా లేవు.
అయినా పవన్ కల్యాన్ తన అన్నయ్య మీద ప్రేమతో నాగబాబును ఫైనాన్షియల్ గా ఆదుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఏపార్టీకి సపోర్ట్ చెయ్యని నాగబాబు పవర్ స్టార్ ఏర్పాటు చేసిన జనసేన లో అంతర్గతంగా వెన్నంటే ఉంటున్నాడు. పార్టీకి తన వంతుగా సాయం చేస్తున్నాడు. అయితే రెండు నెలల క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆరెంజ్ సినిమాను రిలీజ్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. అయితే రీ రిలీజ్ సందర్భంగా ఆరెంజ్ సినిమా వసూళ్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నట్లు నిర్మాత నాగబాబు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అప్పగించాడు నాగబాబు. రూ.1.05 కోట్ల చెక్కును అభమానులతో కలిసి పవన్ కు అందసినట్లు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా రీ రిలీజ్ ట్రెండ్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సినిమాల్లో ఆరెంజ్ కూడా ఒకటి. రీ రిలీజ్ లో వచ్చిన రూ. 1.05 కోట్లను పవన్ కళ్యాణ్ జనసేనకి పార్టీ డోనేట్ చేశారు. తనను కష్టకాలంలో ఆదుకున్న తమ్ముడిని అదే సినిమా రీ రిలీజ్ డబ్బులతో రుణం తీర్చుకున్నాడు నాగబాబు.