జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి పై రచ్చ రచ్చ అవుతోంది. అధికార వైసీపీ శ్రేణులు వారాహి వాహనంపై అవాకులు చవాకులు పేలుతున్నారు. దాంతో చిరాకు కలిగిన పవన్ కళ్యాణ్ తాజాగా ఓ పోస్ట్ పెట్టి వైసీపీ నాయకులను , శ్రేణులను మరింతగా కవ్విస్తున్నాడు. ఆలివ్ గ్రీన్ షర్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ చొక్కా అయినా వేసుకోవాలా ? వద్దా ? అంటూ వ్యంగ్యంగా వైసీపీ శ్రేణులను అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్.
నన్ను రకరకాలుగా అడ్డుకున్నారు. ఇప్పుడేమో ప్రచార వాహనం వారాహి గురించి మాట్లాడుతున్నారు. చివరకు నేను ఊపిరి తీసుకోవాలా ? వద్దా ? అనే విషయాన్ని కూడా మీరే ఆజ్ఞాపించేలా కనబడుతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు పవన్. ఏపీలో పవన్ కళ్యాణ్ కు వైసీపీ నాయకులకు అస్సలు పడటం లేదన్న సంగతి తెలిసిందే.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే వారాహి అనే ప్రచార రథం సిద్ధమైంది అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాడు ఇంకేముంది వైసీపీ శ్రేణులు రకరకాల కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. దాంతో పవన్ కళ్యాణ్ ఇలా రియాక్ట్ అయ్యాడు. అధునాతనమైన ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నాడు పవన్. ఏపీలో ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలు వస్తే అందుకు సిద్ధంగా ఉండాలనే కాబోలు వారాహి ని సిద్ధం చేసి ఉంటాడు పవన్ కళ్యాణ్.