33.4 C
India
Friday, May 3, 2024
More

    ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టిన సైఫ్ అలీఖాన్

    Date:

    ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టిన సైఫ్ అలీఖాన్
    ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టిన సైఫ్ అలీఖాన్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30 వ సినిమా సెట్ లోకి అడుగుపెట్టాడు. సైఫ్ అలీఖాన్ సెట్ లో అడుగు పెట్టడంతో ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ సాదరంగా ఆహ్వానించారు.

    అంతేకాదు సైఫ్ అలీఖాన్ , ఎన్టీఆర్ , కొరటాల శివ ల ఫోటోలను ఆ చిత్ర బృందం మీడియాకు విడుదల చేసింది. సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ హీరో అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో సైఫ్ పలు చిత్రాల్లో విలన్ గా నటిస్తూ అద్భుతమైన నటన ప్రదర్శిస్తున్నాడు. హీరోగా కంటే విలన్ గా నటించే పాత్రల్లోనే ఎక్కువగా నటనకు అవకాశం ఉండటంతో అలాంటి పాత్రలను అంగీకరిస్తున్నాడు.

    అయితే మొదట్లో ఈ సినిమాలో విలన్ గా నటించడానికి సైఫ్ ఒప్పుకోలేదు. దాంతో దర్శకుడు కొరటాల శివ మరోసారి సైఫ్ ను సంప్రదించడంతో చేసేదిలేక అందునా మంచి పాత్ర కావడంతో డేట్స్ అడ్జెస్ట్ చేసి అంగీకరించాడు. కట్ చేస్తే ఈరోజు సెట్ లోకి అడుగు పెట్టాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...