
నానమ్మ ఇందిరా దేవి మరణించడంతో వెక్కి వెక్కి ఏడ్చింది చిన్నారి సితార. మహేష్ బాబు కూతురు సితారకు నానమ్మ ఇందిరాదేవి అంటే ఎనలేని ప్రేమ. ఆమెతో ఎక్కువగా ఆడుకునేది. ఆమె ఎక్కువగా మహేష్ బాబు ఇంట్లోనే ఉండేది కాబట్టి అలా సితారకు నానమ్మ అంటే చాలా చాలా ఇష్టం. అయితే ఆమె మరణించడంతో నానమ్మ మరణాన్ని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది.
ఇక సితార ఏడుస్తుంటే ఆమెను ఓదార్చాడు మహేష్ బాబు. ఆ సమయంలో మహేష్ బాబు కూడా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. మహేష్ బాబుకు తల్లి ఇందిరాదేవి అంటే చాలా ఇష్టం. తన సినిమా విడుదల సమయంలో తప్పకుండా ఆమె చేతి కాఫీ తాగేవాడట. ఇది సెంటిమెంట్ గా పెట్టుకున్నాడు మహేష్ బాబు. సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా ? ప్లాప్ అవుతుందా ? అనే టెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్ ని తగ్గించుకోవడానికి అమ్మ చేతి కాఫీ తాగే వాడట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు మహేష్ బాబు స్వయంగా వెల్లడించడం విశేషం.