
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ” వీర సింహా రెడ్డి ”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ గా ” సుగుణ సుందరి ” అనే పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ , కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈనెల 15 న వీర సింహా రెడ్డి చిత్రం నుండి సెకండ్ సింగిల్ గా సుగుణ సుందరి అనే పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి సింగిల్ గా వచ్చిన ” జై బాలయ్య జై జై బాలయ్య ” అనే పాట దుమ్ములేపిన విషయం తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2023 జనవరి 12 న విడుదల చేయనున్నారు. సంక్రాంతి రారాజు అంటే బాలయ్యే ! నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన పలు చిత్రాలు సంక్రాంతికి విడుదలై సంచలన విజయాలు అందుకున్నాయి. ఆ జాబితాలో ఈ వీర సింహా రెడ్డి కూడా చేరడం ఖాయమని ధీమాగా ఉన్నారు నందమూరి అభిమానులు.