రోలెక్స్ పాత్ర చేయడం నాకు ఇష్టం లేదు అయినప్పటికీ చేయాల్సి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు తమిళ స్టార్ హీరో సూర్య. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన సంచలన చిత్రం ” విక్రమ్ ”. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను కుమ్మేసింది. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కమల్ నటజీవితంలోనే నెంబర్ వన్ గా నిలిచింది.
ఆ సినిమాలో చివరలో కేవలం ఒక అయిదు నిమిషాల సేపు రోలెక్స్ పాత్రలో కనిపిస్తాడు సూర్య. అయితే ఆ పాత్ర చేయాలని లోకేష్ ఫోన్ చేస్తే చేయొద్దని అనుకున్నాడట. అయితే అది కమల్ సార్ సినిమా కాబట్టి తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే రోలెక్స్ లాంటి కరడుగట్టిన విలన్ పాత్ర చేయడం మాత్రం ఇష్టం లేదట.
ఇష్టం లేకపోయినప్పటికీ కమల్ సార్ మీదున్న అభిమానంతో ఆ పాత్ర చేయాల్సి వచ్చింది. అంతేకాదు ఛాలెంజ్ గా ఉండే పాత్రలు చేస్తేనే మన సత్తా తెలుస్తుందని కమల్ అన్న మాటలు సూర్యలో ప్రతిద్వనించాయట. అందుకే చేశాను అని అంటున్నాడు సూర్య. రోలెక్స్ పాత్ర చేసినందుకు పారితోషికం తీసుకోలేదు సూర్య దాంతో దాదాపు 60 లక్షల ఖరీదు గల రోలెక్స్ వాచ్ ను బహూకరించాడు కమల్. త్వరలోనే విక్రమ్ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు కమల్ – లోకేష్ కనకరాజ్ లు.