అన్ స్టాపబుల్ 2 ప్రభాస్ ఎపిసోడ్ సరికొత్త సంచలనం సృష్టించింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రభాస్ ఎపిసోడ్ అలా స్ట్రీమింగ్ లోకి రావడమే ఆలస్యం 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ను సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఆ ఎపిసోడ్ విడుదల అయినప్పటి నుండి రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. దాంతో ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది ఆహా సంస్థ. అంతేకాదు బాహుబలి ఎపిసోడ్స్ రెండుగా వస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 29 రాత్రి మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి రాగా ఇక రెండో ఎపిసోడ్ 2023 జనవరి 1 న ఉదయం 10 గంటలకు స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఇక ఈ రెండో ఎపిసోడ్ మరింతగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ ను ఆటపట్టిస్తూ అతడు ఓపెన్ అయ్యేలా బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డార్లింగ్ ప్రభాస్ కు మొహమాటం ఎక్కువ. కానీ ఈ షోలో మాత్రం అతడి మోహమాటన్ని పోగొట్టేలా చేసాడు బాలయ్య. ప్రభాస్ తో పాటుగా మరో హీరో గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. గోపిచంద్ – ప్రభాస్ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు అనే విషయం తెలిసిందే.
ఇక చరణ్ కూడా డార్లింగ్ ప్రభాస్ కు మంచి ఫ్రెండ్ అనే విషయం ప్రేక్షకులకు తెలిసింది. చరణ్ , ప్రభాస్ ల మధ్య జరిగిన సంభాషణ అభిమానులను విశేషాంగా అలరించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో రికార్డులను బద్దలు కొడుతున్నాడు. బాలయ్య షో కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయట. నెట్ ఫ్లిక్స్ అయితే ఎంతటి డబ్బు అయినా చెల్లించడానికి సిద్ధపడుతోందట.