నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్ , వరలక్ష్మీ శరత్ కుమార్
సంగీతం : తమన్
బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
దర్శకత్వం : గోపీచంద్ మలినేని
విడుదల తేదీ : 12 జనవరి 2023
రేటింగ్ : 3/ 5
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరసింహారెడ్డి ప్రేక్షకులను అలరించిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
హైలైట్స్ :
నందమూరి బాలకృష్ణ గెటప్
సిస్టర్ సెంటిమెంట్
యాక్షన్ సీన్స్
సాంగ్స్
నేపథ్య సంగీతం
విజువల్స్
డ్రా బ్యాక్స్ :
సెకండాఫ్ లో నెమ్మదించిన కథనం
కథగా చెప్పాల్సి వస్తే………. తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా అంతకుమించి ప్రాణంగా పెంచుకున్న అన్నయ్య …… అయితే తాను ప్రేమించిన వాడి చావుకు అన్నయ్య కారణమని భావించి పగబట్టిన చెల్లెలు కథే ……ఈ వీరసింహారెడ్డి కథ. సీమ ప్రజల బాగు కోసం అహర్నిశలు శ్రమించి ఎంతటి వాడినైనా ఎదిరించే వీరసింహారెడ్డి చెల్లెలు ముందు మాత్రం తలొగ్గేరకం.
మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 3 పాటలు బాగున్నాయి. ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. గోపీచంద్ మలినేని బాలయ్య ను ఎలా చూపిస్తే బాగుంటుందో అలాగే చూపించాడు. వీరసింహారెడ్డి గెటప్ లో బాలయ్య లుక్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. ఇక ఆ గెటప్ లో బాలయ్య నిజంగా సింహం లాగే ఉన్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ బాలయ్య నోటి వెంట వస్తుంటే థియేటర్లలో మోత మోగిందనే చెప్పాలి. ఇక ఫైట్స్ అభిమానులకు పూనకం తెప్పించేలా ఉన్నాయి.
శృతి హాసన్ కు పెద్దగా నటించడానికి అవకాశం లేకుండాపోయింది. రెండు పాటలు అలాగే కొన్ని సన్నివేశాలు మాత్రమే పంచుకుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కు పవర్ ఫుల్ పాత్ర లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకుంది. దునియా విజయ్ విలన్ గా తన ప్రతిభ చూపించాడు.
సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ సినిమా అంతా బాలయ్య ఒక్కడే తన భుజస్కంధాలపై మోసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తమ నిర్మాణ విలువలు చాటుకున్నారు. ఓవరాల్ గా సంక్రాంతి కి వీరసింహారెడ్డి వీరవిహారం చేయడం ఖాయం. రొటీన్ ఫ్యాక్షన్ డ్రామా నే అయినప్పటికీ బాలయ్య గెటప్ , డైలాగ్స్ తో పక్కా కమర్షియల్ మూవీ గా రూపొందింది వీరసింహారెడ్డి.