36.9 C
India
Sunday, May 5, 2024
More

    Telangana BJP : తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు ఉంటాయా..?

    Date:

    Telangana BJP
    Telangana BJP

    Major changes in Telangana BJP : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో భారీ మార్పులు ఉంటాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల కోడ్ ఇంకో 5 నెలల్లో రానుంది. అప్పటి వరకూ బీజేపీని సమూలంగా మార్చడం సాధ్యం కాదు. అయితే ఉన్న వారితోనే స్ట్రాటజీ ఉపయోగించి రాష్ట్రంను కమలంలో కలుపుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ వ్యతిరేఖ ఓట్లను తమ ఖాతాలో వేసుకుంటే చాలు అత్యధిక మెజారిటీని దక్కించుకోగలుగుతామని అనుకుంటున్నారు బీజేపీ నాయకులు. కానీ కర్ణాటక ఫలితాలు కొంత ఇబ్బంది పెట్టడం మాట వాస్తవమేనని కానీ, అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు తేడా స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటున్నారు. అయితే కర్ణాటక ఫలితాలతో ఊపు మీదున్న కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

    బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంబయ్ ఏకపక్ష నిర్ణయాలు, దూకుడు పార్టీకి కొంచెం చేటు చేసే ప్రమాదం ఉందని ఇక్కడి నాయకులు భావిస్తున్నారు. పార్టీ పటిష్టత, చేరికలు, గెలుపుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఉండి పార్టీ కార్యాచరణపై విచారించనున్నారు. బండి సంజయ్ దూకుడుగా ఉన్నా. ఆయన వల్లే తెలంగాణలో బీజేపీకి పట్టు దొరికిందని, ఆయననే ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ స్టేట్ చీఫ్ పదవి కోసం ఈటల కూడా గట్టిగా ప్రయత్రిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వస్తే, పార్టీలో చీలికలు ఉంటాయా..? అనే కోణంలో ఆలోచిస్తుంది అధినాయకత్వం. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు ఈటల రాజేందర్. కానీ చాలా మంది సీనియర్ నాయకులు పార్టీని నమ్ముకొని ఏళ్లుగా కష్టపడుతున్నారు. ఇప్పడు పదవి ఈటలకు ఇస్తే చీలికలు ఏర్పడవచ్చని అనుకుంటున్నారు.

    ఈ అసెంబ్లీ ఎన్నికల వరకూ దాదాపు అధ్యక్షడు మారకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బండి సంజయ్ చురుకైన నాయకుడు. ఆయన హయాంలోనే తెలంగాణలో పార్టీ గతంలో కంటే వేగంగా పుంజుకుంది. హిందుత్వ ఎంజెండాను ముందుకు తీసుకుపోవడంతో ఆయన సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాదాపు 40 మంది వరకూ కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. బండి నాయకత్వంపై చాలా మంది గుర్రుగా ఉన్నా.. పార్టీ ఆదేశాల మేరకు కలిసి పని చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Congress in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్.. రోజు రోజుకు బలహీన పడుతున్న బీఆర్ఎస్

    Congress in Telangana : చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత...

    Telangana BJP : తెలంగాణలో పది సీట్లపై కాషాయ పార్టీ నజర్.. గెలుపుపై ధీమా..

    Telangana BJP : రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం...