33.7 C
India
Sunday, May 5, 2024
More

    CM Siddha Ramaiah : సీఎం సిద్ధూనే.. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రకటన!

    Date:

    CM Siddha Ramaiah
    CM Siddha Ramaiah

    CM Siddha Ramaiah : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. డిప్యూటీ సీఎం గా డీకే శివకుమార్ పేరును ప్రకటించింది. ఆరో రోజుల ఉత్కంఠ చర్చల నడుమ ఎట్టకేలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ , కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జి రణ్దీప్ సుర్జేవాలా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే కాంగ్రెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నది.

    పీసీసీ చీఫ్ కూడా ఆయనే..

    కర్ణాటక ఏకైక డిప్యూటీ సీఎంగానే కాకుండా పీసీసీ చీఫ్ గా కూడా డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ ఈయనే రాష్ర్ట బాధ్యతలు నిర్వర్తిస్తారు. అయితే గురువారం రాత్రి కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ఉంటుంది. ఎమ్మెల్యేలు అధికారికంగా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అనంతరం తమ లేఖను గవర్నర్ కు అందజేస్తారు. ఈనెల 20న సిద్ధరామయ్య కంఠిరవ స్టేడియంతో ప్రమాణ స్వీకారం చేస్తారు.

    అయితే సోనియా రంగంలోకి దిగి , డీకే కు సర్ధిచెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన అనంతరం ఇద్దరు నేతలు అభిమానులకు అభివాదం చేశారు. ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లారు. దీంతో ఇక వివాదానికి చెక్ పడినట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటక తదుపరి సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది.
    పలువులు ముఖ్యమంత్రులు, అగ్రనేతలు, విపక్షాల నేతలు ఈ కార్యక్రమానికి రానున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి వారికి ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఎల్లుండి జరిగే కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సిద్ధరామయ్యకు ఇఫ్పటికే ప్రోటోకాల్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయనకు భద్రత పెంచినట్లు తెలుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : తెలంగాణ భవిష్యత్ ఇలానే ఉండబోతుందా..? కేటీఆర్ సంచలన ట్వీట్

    KTR : కర్ణాటక సీఎం సిద్ద రామయ్యపై కేటీఆర్ చేసిన ట్వీట్...

    karnataka congress: సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం.. హుటా హుటిన బెంగళూర్‌కు వచ్చిన సీనియర్ నేతలు..

    karnataka congress: పదేళ్లుగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైన కాంగ్రెస్ పార్టీ...

    Komatireddy Meets DK : నేడు డీకేను కలువనున్న కోమటిరెడ్డి.. అందుకే అంటూ కామెంట్లు!

    Komatireddy Meets DK : కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్...

    ఇక సునీల్ కనుగోలు మకాం తెలంగాణలోనే.. ఇప్పటికే ఎంట్రీ..

    ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణ కు మకాం మార్చారు. కర్ణాటకలో...