36.1 C
India
Saturday, May 4, 2024
More

    Avinash : అవినాష్ కు మరో ఛాన్స్.. 22న విచారణకు రావాలని ఆదేశం

    Date:

    Avinash
    Avinash

    Avinash : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో ఆయనను సీబీఐ కొన్ని రోజులుగా విచారిస్తున్నది. ప్రస్తుతం కేసు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ దూకుడు పెంచింది. వచ్చే నెలాఖరులోగా కేసును కొలిక్కి తేవాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది.

    రెండు సార్లు గైర్హాజరు..

    ముందుగా ఈనెల 16న విచారణకు రావాలని సీబీఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని తమ కార్యాలయానికి 11 గంటలకు రావాలని ఆదేశించింది. అయితే వ్యక్తిగత కారణాలతో నాలుగు రోజుల పాటు విచారణకు రావడం వీలు కాదని ఎంపీ అవినాష్ సీబీఐ కి లేఖ రాశారు. ఆ వెంటనే హైదరాబాద్ నుంచి కడప బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత  శుక్రవారం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఈ విచారణకు కూడా ఆయన డుమ్మా కొట్టారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయ న విచారణకు రాలేదు. దీనిని సీబీఐ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయం దీనిపై తీవ్రంగా స్పందించింది.

    అయితే మరోసారి అవినాష్ కు సీబీఐ అవకాశం ఇచ్చింది. కర్నూల్ లోని విశ్వ భారతి వైద్యశాలలో ఆయన తల్లితో ఉన్నారు. అక్కడే ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22న 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. ఎంపీ తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాకే సీబీఐ ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dastagiri Petition : జగన్ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించoడి : సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్

    Dastagiri Petition : హైదరాబాద్: మాజీమంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్...

    CBI Investigation : తిరుపతి చంద్రగిరి – రైల్వే SSE, ADEE లంచం కేసులో సీబీఐ విచారణ

    CBI Investigation :  ఏపీ తిరుపతి:  రెండు రైల్వే జోన్‌లకు చెందిన ఇద్దరు...

    CM Revanth : ‘కాళేశ్వరం’లో అవినీతిపై రేవంత్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదు?

    CM Revanth : తెలంగాణ రాజకీయాలు గత కొద్దికాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు...

    YS Avinash Reddy : వైఎస్ అవినాష్ బెయిల్ రద్దుకు సీబీఐ పిటిషన్

    YS Avinash Reddy : ఏపీ సీఎం సోదరుడు, కడప ఎంపీ వైఎస్...