36.8 C
India
Thursday, May 2, 2024
More

    NTR centenary : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో వారిద్దరేరి..? అంతా చర్చ..!

    Date:

    NTR centenary
    NTR centenary
    NTR centenary : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. టిడిపి తో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల పలువురిని సన్మానిస్తూ అవార్డులను అందజేస్తూ సత్కరిస్తున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్లో ని కూకట్పల్లిలో నిర్వహించిన వేడుకకు అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. అయితే ఒక ఇద్దరు మాత్రం హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
    టిడిపి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. కూకట్పల్లిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించి పలువురిని ఆహ్వానించింది. అయితే ఈ కార్యక్రమానికి సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినా ఆయన రాకపోవడం  చర్చనీయాంశమైంది. టిడిపి తో దూరం ఉండడం వల్లనే ఆయన హాజరు కా లేదని అభిప్రాయం వ్యక్తం అయింది. రామ్ చరణ్ వెంకటేష్ నాగచైతన్య, సుమంత్ విశ్వక్ సేన్, లాంటి హీరోలు వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ తన సొంత తాత శత జయంతి ఉత్సవాలకు రాకపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
    ఎన్టీఆర్ హైదరాబాదులోనే ఉండి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం అందరిని విస్మయానికి గురిచేసింది. మరో వైపు ఎన్టీఆర్ను సోదరుడిలా భావించే మోహన్ బాబు కూడా ఈ కార్యక్రమానికి రాకపోవడంపై అభిమానుల్లో చర్చ జరిగింది. ఎన్టీఆర్ ను అందరికంటే ఎక్కువగా అభిమానించే మోహన్ బాబు ఈ వేడుకల్లో కనిపించకపోవడం చాలామందిని విస్మయానికి గురి చేసింది. అయితే టిడిపి మోహన్ బాబు ను ఆహ్వానించలేదని ఒక చర్చ బయటకు వచ్చింది.  ఏదేమైనా ఈ ఇద్దరి గైర్హాజరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్నది.

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...