33.8 C
India
Sunday, May 5, 2024
More

    పుట్టిన రెండేళ్లకే జీవిత ఖైదు.. కిమ్ ఆకృత్యాలపై అమెరికా గుస్సా..

    Date:

    Kim actions
    Kim actions

    Kim actions : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దారుణాల గురించి చెప్తే పెద్ద చరిత్రే అవుతుంది. చిన్న చిన్న నేరాలకే ప్రాణాలను సైతం తీసే శిక్షలు విధిస్తాడు ఆయన. అక్కడి ప్రజలకు బతుకు నిత్య నరకమనే చెప్పాలి. ఆయన పాలనలోని ఆకృత్యాలు మరోసారి వెలుగు చూశాయి. క్రైస్తవులపై కిమ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీనిపై ఇటీవల అమెరికా కూడా విచారం వ్యక్తం చేసింది. ఇక ఉత్తర కొరియాలో క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ తో ఎవరైనా కనిపిస్తే కఠిన శిక్షలు ఉంటాయి. ఇటీవల రెండేళ్ల చిన్నారి చేతిలో బైబిల్ చూసిన కిమ్ ఆమెకు జీవిత ఖైదు శిక్షవిధించినట్లు అమెరికా నివేధిక వెల్లడించింది.

    ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022’ పేరుతో అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో ఉత్తర కొరియా అవలంభించే విధానాలపై దారణంగా విరుచుకుపడింది. ఇతర మతాల పట్ల కిమ్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ఇప్పటి వరకూ అక్కడ దాదాపు 70 వేల మంది క్రైస్తవులను ఖైదు చేసినట్లు నివేదికలు చెప్తున్నాయన్నాని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇందులో రెండేళ్ల చిన్నారి కూడా ఉండడం తీవ్రంగా కలిచివేసిందన్నారు.

    మత పరమైన కార్యకలాపాలు, మత గ్రంథం కలిగి ఉందన్న నెపంతో కిమ్ ప్రభుత్వం 2009లో సదరు చిన్నారి కుటుంబాన్ని అరెస్ట్ చేసి చిన్నారికి కూడా వరితో కలిపి జీవిత ఖైదు విధించినట్లు శాఖ తెలిపింది. 2021లో కొరియా వ్యూచర్ అనే సంస్థ కూడా మత విశ్వాసాలపై కిమ్ ప్రభుత్వం చేసే ఆగడాల విషయమై ఒక నివేదిక కూడావిడుదల చేసింది.

    ఇలా మతపరమైన శిక్షల కింద జైలు శిక్షలు విధించిన వారిని పొలిటికల్ జైలు శిబిరాలకు తరలించి హింసిస్తుందని శాఖ నివేదికలో వెల్లడించింది. ఈ శిబిరాల్లోని ఖైదీలపై ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని, శారీరకంగా, మానసికంగా హింసించడం, ఎటువంటి విచారణ లేకుండా శిక్షలను అమలు చేయడం ఈ శిబిరాల్లో నిత్యం కొనసాగుతున్నాయని నివేదిక వెల్లడించింది.

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    World Leadership Comments Biden World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు...

    Retirement : విరమణ తర్వాత ఆనందంగా గడిపేందుకు ఎంత అవసరం?

    Retirement : చాలా మంది ఉద్యోగులు సౌకర్యవంతమైన జీవనం కొనసాగించాలంటే గణనీయమైన...