33.8 C
India
Sunday, May 5, 2024
More

    NARTANASALA- NTR- SVR- SAVITHRI- NARTANASALA COMPLETES 59 YEARS: 59 ఏళ్ళు పూర్తి చేసుకున్న నర్తనశాల

    Date:

    nartanasala-ntr-svr-savithri-nartanasala-completes-59-years-nartanasala-that-has-completed-59-years
    nartanasala-ntr-svr-savithri-nartanasala-completes-59-years-nartanasala-that-has-completed-59-years

    మహా నటులు నందమూరి తారకరామారావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, రేలంగి తదితరులు కలిసి నటించిన అపురూపమైన దృశ్యకావ్యం నర్తనశాల. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నటి లక్ష్మీరాజ్యం తన భర్త శ్రీధర్ రావుతో కలిసి రాజ్యం పిక్చర్స్ పతాకంపై  నిర్మించడం విశేషం. మహాభారతం లోని విరాటపర్వం ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని నర్తనశాల చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 1963 అక్టోబర్ 11 న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం విడుదలై 59 సంవత్సరాలయ్యింది. 

    ఎన్టీఆర్ అర్జునునిగా నటించిన విషయం తెలిసిందే. అయితే శాపం వల్ల బృహన్నలగా మారుతాడు. బృహన్నల పాత్రలో ఎన్టీఆర్ ఆకట్టుకుంటాడా అనే సవాలక్ష అనుమానాలను పటాపంచలు చేసింది ఈ చిత్రం. సాధారణంగా ఒక మగాడు లేడీ వేషం వేస్తే కాస్త ఎబ్బెట్టుగానైనా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం బృహన్నల గెటప్ లో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. అసలు నర్తనశాల చిత్రానికి ఎన్టీఆర్ బృహన్నల గెటప్ హైలెట్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

    ఇక మహానటుడు ఎస్వీ రంగారావు  , సావిత్రి, రేలంగి, ముక్కామల , మిక్కిలినేని వంటి అతిరథమహారధులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సీనియర్ సముద్రాల ఈ చిత్రానికి రచన అందించగా దక్షిణామూర్తి సంగీతం అందించారు. నర్తనశాల చిత్రంలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. చరిత్ర సృష్టించిన ఈ చిత్రం విడుదలై 59 సంవత్సరాలు అవుతోంది. ఇక ఇదే చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ రీమేక్ చేయాలని అనుకున్నాడు. సినిమా ప్రారంభించాడు కూడా అయితే అనుకోని అవాంతరాలు రావడంతో నర్తనశాల చిత్రాన్ని పక్కన పెట్టాడు. అయితే ఎప్పటికైనా సరే నర్తనశాల చిత్రాన్ని నిర్మించాలని పట్టుదలగా ఉన్నాడు బాలయ్య. దానికి కాలమే సమాధానం చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...