
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో BRS నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ అంతటా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ అంతటా బండి సంజయ్ దిష్టి బొమ్మ లను దహనం చేశారు. అంతేకాదు తెలంగాణ లోని పలు పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ పై కేసు నమోదయ్యాయి.
ఇక తెలంగాణ మహిళా కమీషన్ కూడా తీవ్రంగా స్పందించింది. కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను ఢిల్లీ లో కూడా దహనం చేశారు. బీజేపీ డౌన్ డౌన్ ….. మోడీ డౌన్ డౌన్ …… బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.