టాలీవుడ్ లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. గుండెపోటుతో మరణాలు అంటే ……. దాదాపు 60 ఏళ్ల తర్వాతే ఉండేది కానీ రోజులు మారాయి దాంతో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇటీవలే నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించగా ఆ సంఘటన మరిచిపోకముందే కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో మరణించాడు. దనతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.
2017 లో వచ్చిన దర్శకుడు అనే సినిమాతో కెమెరామెన్ గా కెరీర్ ప్రారంభించాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా , ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రాలతో పాటుగా ధూమ్ 3 , బేబీ , బాజీరావు మస్తానీ తదితర చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసాడు ప్రవీణ్ అనుమోలు.