Poola Rangadu Director : ప్రముఖ ఎన్ఆర్ఐ.. యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీశ్ యలమంచిలి గారు ఆధ్యాత్మిక.. సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడు ముందుంటారనే సంగతి అందరికీ తెల్సిందే. డాక్టర్ జగదీశ్ యలమంచిలి తాజాగా న్యూజెర్సీలోని శ్రీ సాయి దత్త పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా డైరెక్టర్ వీరభద్రం చౌదరిని మార్యదపూర్వకంగా కలుసుకున్నారు. వీరిద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
కాగా వీరభద్రం చౌదరి ఆంధప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం కలవల పల్లె గ్రామానికి చెందిన వారు. 1997లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 2011 సంవత్సరంలో అల్లరి నరేష్ హీరోగా ‘అహ నా పెళ్ళంట’ సినిమాతో డైరెక్టర్ గా మారారు. 2012లో సునీల్ హీరోగా నటించిన ‘పూలరంగడు’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. 2013లో కింగ్ నాగార్జునతో ‘భాయ్’..2016లో ఆదితో ‘చుట్టాలబ్బాయ్’..2021లో ఆదితో ‘కిరాతక’ అనే సినిమాలు తెరకెక్కించారు.