
బ్రేకింగ్ న్యూస్…… సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్వప్న లోక్ కాంప్లెక్స్ చాలా ఫేమస్. పైగా పురాతన కాంప్లెక్స్. ఈ బిల్డింగ్ లో 7 , 8 వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో పని చేస్తున్న వర్కర్స్ హాహాకారాలు చేశారు. కొంతమంది బయటకు రాగా లోపల కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దాంతో లోపల ఉన్నవాళ్లు బయటకు రాలేకపోయారు. స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని తెలియడంతో హుటాహుటిన 4 ఫైరింజన్లు వచ్చాయి. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మంటలు అదుపులోకి రాలేదు.