
బ్రేకింగ్ న్యూస్ ……. సీనియర్ హీరో ప్రభు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. 66 సంవత్సరాల ప్రభు మహానటులు శివాజీ గణేశన్ తనయుడు అనే విషయం తెలిసిందే. శివాజీ గణేశన్ లెగసీని కొనసాగిస్తూ సినిమాల్లోకి వచ్చిన ప్రభు తమిళనాట స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ప్రభు నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. అంతేకాదు తెలుగులో రీమేక్ అయ్యాయి …… ఇక్కడ కూడా ప్రభంజనం సృష్టించాయి.
అయితే గతకొంత కాలంగా కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు ప్రభు. ఇటీవల ఆ బాధ ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లగా లేజర్ ఎండోస్కోపీ సర్జరీ చేశారట. ఆపరేషన్ కావడంతో నాలుగైదు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఆ తర్వాత డిశ్చార్జ్ కానున్నాడట. ఆపరేషన్ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రభు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
గతకొంత కాలంగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో ప్రభు అనారోగ్యానికి గురయ్యారు అని తెలియగానే అభిమానులు కంగారు పడ్డారు. అయితే డాక్టర్లు , కుటుంబ సభ్యులు అభిమానులకు భరోసా ఇస్తున్నారు దాంతో అభిమానులు స్వాంతన చెందారు. ప్రభు తమిళనాట స్టార్ హీరోగా 80-90 వ దశకంలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించాడు.