
Jr NTR : నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల విశేష అభిమానాన్ని పొందారు.. ఈయనను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. ఎప్పటి నుండో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నందమూరి ఫ్యామిలీ భారీ ఏర్పాట్లు చేసారు.
ఈ వేడుకలకు చాలా మందికి ఆహ్వానం అందింది.. అక్కినేని, దగ్గుబాటి, మెగా హీరోలు కూడా హాజరయ్యారు.. అలాగే ఈ మధ్యన టాలీవుడ్ లోకి తెరగేంట్రం చేసిన వారికీ అందగా వారు కూడా హాజరయ్యారు.. కానీ నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి ఎన్టీఆర్ మాత్రం హాజరవలేదు.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను టీడీపీ పార్టీ కూడా ఘనంగా నిర్వహించింది.
ఈ వేడుకలకు ఎన్టీఆర్ మనవడు తారక్ ను కూడా ఆహ్వానించింది. హైదరాబాద్ లో ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు స్వయంగా ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానం అందించారు కమిటీ ఛైర్మెన్, టీడీపీ నేత జనార్దన్.. కానీ ఎన్టీఆర్ ముందుగానే ఈ వేడుకలకు రావడం లేదని ప్రకటించారు.. అయితే తాజాగా ఈ విషయంలో ఎన్టీఆర్ పై జనార్దన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
మేము ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి ప్రయత్నం చేశామని.. కానీ వారం రోజుల తర్వాత టైం ఇచ్చారని.. ఉత్సవాలకు రావాలని రిక్వెస్ట్ చేసాం అని కానీ ఆల్రెడీ బర్త్ డే వేడుకలను ఫిక్స్ చేసుకున్నట్టు తెలిపారు అని.. పుట్టిన రోజులు ఎప్పుడైనా జరుపుకోవచ్చు.. కానీ ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలు ఎప్పుడు రావు.. ఎన్టీఆర్ షెడ్యూల్ కుదరలేదేమో ఆయన రాలేదు అంటూ జనార్దన్ చెప్పుకొచ్చారు.. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.