Tribute to NTR in TANA 2023 : తెలుగు సినిమా ఖ్యాతిని దిశ దిశలా వ్యాపింపజేసిన మహా నటుడు ఎన్టీఆర్. తనదైన పాత్రలతో సినిమా రంగాన్ని ఉర్రూతలూపించిన నటుడు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నింపిన నేతగా కొనియాడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేపట్టిన పాలన తీరు కూడా అప్పట్లో ఎంతో గొప్పదిగా పేర్కొనబడింది. అలా నటనతో పాటు రాజకీయాలను శాసించిన ఎన్టీఆర్ పాత్ర తెలుగు వారిలో ఉత్తేజాన్ని నింపింది.
ఆయన స్ఫూర్తితో ఎంతో మంది రాజకీయాల్లో, నటనలో ముందుకు వచ్చారు. చరిత్ర సృష్టించిన పురుషుడు ఎన్టీఆర్. ఆయన తనదైన రీతిలో రాజకీయాలను నడిపించి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు మహోన్నత శక్తి. తెలుగు వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన నేతగా ఆయన కీర్తి అజరామరం. ఆయన తీరు ఆదర్శనీయం.
తానా 2023 సభల్లో మూడో రోజు ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు. గుమ్మడి గోపాలకృష్ణ శ్రీకృష్ణుడిగా నటించి అలరించారు. ప్రవాస అతిథులు ఎన్టీఆర్ పోషించిన పాత్రలను చూపించారు. ఎన్టీఆర్ చూపించిన నటనను ప్రదర్శిస్తూ చప్పట్లు కొట్టించుకున్నారు. అలనాటి మహానటుడు ఎన్టీఆర్ అంటే అందరికి ఆసక్తి ఉంటుంది. అలా తన జీవితంలో జరిగిన సంఘటనలను చూపించి అందరిలో ఆలోచనలు నింపారు.
ఇది వరకే ఎన్టీఆర్ కు ఆస్ట్రేలియాలో సైతం ఘన నివాళి అర్పించారు. మన తెలుగు వారైన ఎన్టీఆర్ విషయంలో విదేశాల్లో సైతం గుర్తింపు రావడం గమనార్హం. ఎన్టీఆర్ జీవితం ఆదర్శప్రాయంగా భావించడంతో ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి ఇదే అంటున్నారు. మన తెలుగు తేజం ఎన్టీఆర్ చరిత్ర గురించి మనం ఇప్పటికి కూడా చెప్పుకోవడంతో ఆయనను మనం స్మరించుకోవడమే.