Jayasudha sensational comments :
మన తెలుగు ప్రేక్షకులకు సహజ నటి జయసుధ అంటే తెలియని వారు ఉండరు.. ఈ సీనియర్ హీరోయిన్ ఎన్నో సినిమాల్లో నటించింది.. తన సహజమైన నటనతో సహజ నటి అనే బిరుదును సొంతం చేసుకుంది.. అప్పట్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇక ఇప్పుడు కూడా తన వయసుకు తగిన పాత్రలను చేస్తూ కెరీర్ లో రాణిస్తుంది.
ఇదిలా ఉండగా ఈ భామ స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని వందల సినిమాలను చేసింది.. ఇప్పటికి చేస్తూనే ఉంది. అయితే జయసుధ తన కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన కొన్ని విషయాలను తాజాగా రివీల్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈమె అప్పట్లోనే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంది అని చెప్పుకొచ్చింది. ఈ మధ్య ఎక్కువుగా వినిపిస్తున్న పేరు ఇది.. ఎంతో మంది హీరోయిన్ లు, నటీమణులు బయటకు వచ్చి ఒక్కొక్కరిగా తాము ఎదుర్కున్న ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. ఇక తాజాగా జయసుధ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందని చెప్పుకొచ్చింది.
ఈ భామ మాట్లాడుతూ.. తాను కూడా గతంలో క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని తెలిపింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న తరుణంలోనే నార్త్ కు వెళ్లానని.. అక్కడ నాకు ఒక డైరెక్టర్ పరిచయం అయ్యి ఛాన్సులు ఇప్పస్తానని చెప్పి అతని ఆఫీస్ కు రమ్మన్నాడు..
డైరెక్టర్ తర్వాత సినిమాలో మీకు ఛాన్స్ ఇస్తాం అన్నారు అని మేనేజర్ చెబుతూ.. కానీ అందుకు మీరు ఒక రోజు గెస్ట్ హౌస్ లో సార్ ను కలుసుకోవాలని చెప్పారు.. మ్యానేజర్ అంత డైరెక్ట్ గా చెప్పడంతో నాకు మ్యాటర్ అర్ధం అయ్యి వెంటనే అక్కడ నుండి వచ్చేసాను.. అప్పటి నుండి మళ్ళీ బాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది.