Rameswaram Cafe : అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్ లో అత్యం త ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుం డి ప్రముఖులను ఆహ్వానించి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రే షన్స్ నిర్వహిస్తున్నారు . పసందైన వంటకా లతో అతిధులకు ఆతిధ్యం ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే బెంగళూరులోని ఫేమస్ రెస్టారెంట్ అయిన అయిన రామేశ్వరం కేఫ్ లో నిన్న మధ్యా హ్నం బాంబు పేలుడు సంభవించింది. బాగా రద్దీ గా ఉన్నమధ్యాహ్నం సమయంలో ఈ బాంబు పేలుడు జరగగా పలువురు గాయాల పాలై ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు, బెంగుళూరు పేలుడు ఘటనకు ఉన్న సంబంధం ఏంటి అని అలోచిస్తున్నారా? సబంధం ఉంది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించి క్యాటరింగ్ బాధ్యత లను రామేశ్వరం కేఫ్ యజమాని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఆయన గుజరాత్ లోని జామ్ నగర్ లో బిజీగా ఉండగా .. ఈ క్రమంలోనే జరిగిన పేలుడు ఘటన ఆయనను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.
దీంతో ఆయన హుటాహుటిన బెంగళూరుకు చేరుకున్నారు . ఈ బాంబు పేలుడులో బ్యాగుతో వచ్చిన ఒక వ్యక్తి కేఫ్ లో బ్యాగ్ ను వదిలేసి వెళ్ళి పోయాడు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవిం చి కేఫ్ కు వచ్చిన కస్టమర్లతో పాటు సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .
అయితే అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ క్యాటరింగ్ రామేశ్వరం కేఫ్ యజమాని చూసుకోవటంతో ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ కి, పేలు డుకు ఏమైనా తెలియని సంబంధం ఉందేమో అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే బెంగుళూరు బాంబు పేలుడు ఘటన నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రంలోనూ అలెర్ట్ ప్రకటించి పోలీసులు విరివిగా వాహన తనిఖీలు చేస్తున్నారు. బెంగుళూరు బాంబు పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.