21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Anjali : అలాంటి వాడైతేనే పెళ్లి చేసుకుంటానంటున్న అంజలి..

    Date:


    Anjali : తెలుగు నేలపై పుట్టినా తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది అంజలి. ఇక మదర్ టంగ్ తెలుగులో ఇప్పటి వరకైతే రాణించింది. ఇక కన్నడ, మలయాళం, హిందీల్లో కూడా రాణిస్తూనే ఉంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ కనిపిస్తూ దుమ్మురేపుతుంది ఈ అమ్మడు. ఆమె రీసెంట్ వెబ్ సిరీస్ ‘ఝాన్సీ’ ఓటీటీలో మంచి హిట్ గా నిలిచింది. దీంతో పాటు మరిన్ని వెబ్ సిరీస్, సినిమాలతో బిజీగానే ఉంది అంజలి.

    తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో అంజలి త‌న‌కు కాబోయే భర్త గురించి చెప్పింది. అతను ఎలా ఉండాలి..? త‌న‌కు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే ఇష్టమో తెలిపింది. పెళ్లి, కాబోయే వ‌రుడు గురించి ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నలకు బ‌దులిచ్చింది. ‘రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో ఒకరిపై ఒకరికి మొదట మర్యాద ఉండాలి. ఆ తర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ ఏర్పాడుతాయి. మర్యాద లేదని వ్యక్తితో తాను రిలేషన్ కొనసాగించలేను’ అని చెప్పింది. కెరీర్, రిలేష‌న్‌షిప్‌లో ఏది ముఖ్యమనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘రెండూ కూడా ప్రధానమైనవే’ అని తెలిపింది. నాకు కాబోయే వ‌రుడికి మ‌ర్యాద తెలిసి ఉండాలి, అలాంటి వ్యక్తి కోసమే ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది అంజలి. అయితే అప్పట్లో జర్నీ ఫేమ్ జైతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఇక వీరిద్దరూ వివాహం కూడా చేసుకుంటారన్న వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

    గతంలోనూ అంజలి ఈ విషయంపై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది. నీకు ఎలాంటి భర్త కావాలని అడిగితే ‘విరాట్ కోహ్లి’లా హుషారుగా ఉండాలి, కోహ్లిలో ఉండే చురుకుదనం, అందం ఉండాలి’ అని చెప్పేసింది అంజలి. దీనికి తోడు మరిన్ని క్వాలిటీలను కూడా చెప్పింది ఈ అమ్మడు. నున్నగా షేవ్ ఉండద్దని, ట్రిమ్ మాత్రమే చేసుకోవాలని చెప్పింది. ధృడమైన నిర్ణయాలు తీసుకునే సత్తా ఉన్న వ్యక్తి కావాలని, అలాంటి లక్షణాలున్న వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. అయితే ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి ఎదురయ్యరా..? అంటే, తనకు కావాల్సిన వ్యక్తి ఇంకా దొరకలేదని చెప్పింది. మరి ఇన్ని క్వాలిటీస్ ఎవరిలోనైనా ఉంటాయా..? ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anjali : ఆ సీన్లు చేసేటపుడు ఎవరినీ దగ్గర ఉండనీయలేదు: అంజలి

    Anjali : షాపింగ్ మాల్ మూవీతో చిత్ర సీమలోకి అడుగుపెట్టింది తెలుగు...

    Anjali New Look : న్యూ లుక్స్ తో ముంచెత్తిన అంజలి

    Anjali New Look : తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో...