32.5 C
India
Thursday, May 2, 2024
More

    GTA Anniversary : ఎన్నారైలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే.. జీటీఏ వార్షికోత్సవంలో వక్తలు..

    Date:

    GTA Anniversary
    GTA Anniversary 2023

    GTA Anniversary 2023 : ఎన్నారైల ఆధ్వర్యంలో జీటీఏ(గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్) తొలి వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ మారియట్ హోటల్ లో ఘనంగా జరిగాయి. ప్రవాస తెలంగాణ వాసులతో కలిపి ఏర్పాటు చేసిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫోరం ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ఎంపీ బండి సంజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

    GTA Anniversaryఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. శక్తివంతమైన భారత్ ను నిర్మించడంలో జీటీఏ భాగస్వామ్యం కావాలని కోరారు. వివిధ దేశాల్లోని తెలంగాణ వారందరినీ ఒక్కచోటకు చేర్చుతున్న జీటీఏను ఆయన అభినందించారు. తనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, ఎంతోమంది ఎన్నారైలు డబ్బు లేకపోయినా కష్టపడి పైకి వచ్చినవాళ్లేనన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ భారత్ అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివన్నారు.

    GTA Anniversary 2023తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇతర దేశాల్లో చాటుతుంది తామేనని జీటీఏ ఫౌండర్, ఇండియా చైర్మన్ మల్లారెడ్డి తెలిపారు. ఎన్నారై తలుచుకుంటే.. రాజకీయ నాయకుడి కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపించగలడని ఆయన చెప్పారు. ఎన్నారైలు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి కుటుంబాన్ని కలిసే వాళ్లు మాత్రమే కాదని జీటీఏ నిరూపించిందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఎన్నారైలు తలుచుకుంటే దేన్నైనా సాధించి చూపిస్తారని, వాళ్లను తక్కువ అంచనా వేయవద్దని సూచించారు.

    Global Telangana Associationకార్యక్రమంలో భారత్ కు చెందిన 150 మంది బోర్డు సభ్యులు హాజరయ్యారు. వీరిలో గ్రేట్ అండ్ మీట్ కార్యక్రమం చైర్మన్ మల్లారెడ్డి, జీటీఏ అడ్వయిజర్ చైర్ రవీందర్ రెడ్డి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యోయో మీడియా సీఈవో నవీన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఎన్నారైలు గ్రేట్ అండ్ మీట్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి, స్పాన్సర్లకు జీటీఏ ఫౌండర్ చైర్మన్ మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    Free Haleem : ఫ్రీ హలీం.. ఎగబడ్డ జనం లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. వైరల్ వీడియో..

    Free Haleem : రంజాన్ మొదలైందంటే చాలు హలీం దుకాణాలు వెలవాల్సిందే....