ATA Business Seminar : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) న్యూ జెర్సీలో బిజినెస్ సెమినార్ నిర్వహించింది. ఆదివారం (మార్చి 10) కింగ్ జార్జ్స్ రోడ్ లోని ఒక సెమినార్ హాల్ లో సెమినార్ సాగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ సెమినార్ లో ఆటా కమిటీతో పాటు సభ్యులు పాల్గొన్నారు. బిజినెస్ కు సంబంధించి పలు అంశాలను కమిటీతో సహా ఆటా సభ్యులు ఒకరినొకరు పంచుకున్నారు.
వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఎలా డెవలప్ కావాలనే అంశాలపై వివరించారు. పారిశ్రామిక వేత్తలు, ప్యారులు వారి ఆలోచనలను అందరితో పంచుకున్నారు. నెట్‌వర్క్ పెంచుకుంటేనే బిజినెస్ లో సక్సెస్ సాధించడం సాధ్యమవుతుందని వారు వివరించారు. ప్రొడక్ట్ క్వాలిటీగా అందిస్తేనే కంపెనీపై విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. వీటితో పాటు చాలా విషయాలను ఈ వేదికగా వ్యాపారులతో పాటు సభ్యులు కూడా పంచుకున్నారు. ఇందులో స్నాక్స్ అండ్ ఫుడ్ ఏర్పాటు చేశారు. ఈ సెమినార్ మొత్తం సందడిగా, ఆనందంగా సాగింది.
కార్పొరేట్ చైర్మన్ హరీష్ బొత్తిని, కార్పొరేట్ కో-చైర్మన్ అండ్ RC ప్రదీప్ రెడ్డి కట్టా, రీజినల్ కోఆర్డినేటర్స్ సంతోష్ రెడ్డి, రీజినల్ ఉమెన్ చైర్మన్ గీతా రెడ్డి, ఉమ్మెన్స్ కో ఆర్డినేటర్ మీనాక్షి తునికి పాల్గొన్నారు. వీరితో పాటు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ బొమ్మినేని మధు, కన్వీనర్ పాశం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.