Avika Gore Gorgeous Look :
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన వారిలో అవికా గోర్ ఒకరు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ సీరియల్ బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) లో నటించిన ఈ చిన్నది కెరీర్ ప్రారంభంలో వెండితెరపై కూడా అలాంటి సినిమాలనే చేస్తూ వచ్చింది.
హిందీలో సీరియల్స్ లో బిజీగా ఉండే ఈ ‘బుల్లి’ నటి ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.
తెలుగుతో పాటు బాలీవుడ్, కోలివుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ లాంటి చిత్ర సీమల్లో కూడా రాణిస్తూ తన సత్తా చాటుకుంటుంది ఈ చిన్నది.
ఉయ్యాల జంపాల తర్వాత దాదాపు 11 తెలుగు సినిమాల్లో చేసిన అవికా. ప్రతీ చిత్రంతో వైవిద్య భరిత నటనను చూపించింది.
ముంబైలో జన్మించిన అవికా గోర్ అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. 2007లో చేసిన ఉష్.. కొయీ హై.. సీరియల్ తో బుల్లితెరపై ఆమె అడుగుపెట్టింది.
ఉయ్యాల జంపాల సినిమాకు సంబంధించి ఉస్ట్ ఎంట్రీ హీరోయిన్ గా సీమా అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కనిపించీ కనిపించకుండా ఆమె ప్రేమించడం ఆ సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. రాజు గారి గది 3లో నాగార్జునతో కలిసి చేసింది అవికా గోర్.
సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది అవికా. అందుకూ ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది.
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 3 సార్లు ఎంపికైంది అవికా గోర్. ముంబై చిన్నదైన అవికా గోర్ కు హిందీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
ఇక వారి కోసం అమ్మడు అప్పుడప్పుడు హాట్ షోలు చేస్తూ పిక్స్ ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తుంటుంది. వీటిని ఆమె ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు.